సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (19:13 IST)

ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వనిత.. అయినా తలనొప్పి తప్పట్లేదు.. (video)

Vanitha Vijayakumar
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార గతంలో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది. ఈ ప్రేమాయణం పెళ్ళిపీటల వరకు వచ్చింది. కానీ తొలి భార్య సెగతో ఈ వివాహం ఆగిపోయిందని.. ఆ సమయంలో నయన రెండో భార్య కానుందనే వార్తలు ఆమె ఫ్యాన్సును నొప్పించాయి. దీంతో ఏమనుకుందో ఏమో కానీ నయన ప్రభుదేవాకు బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్‌తో క్లోజ్‌గా వుంది. ఇటీవల కూడా నయనపై ప్రభుదేవా తొలి భార్య విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. 
 
ఇదే తరహాలో ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితకు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఫిలింమేకర్ పీటర్ పాల్‌ను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. పీటర్ పాల్‌కు గతంలోనే వివాహమైంది. ఇప్పుడు పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ చెన్నై, వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని, పీటర్ పాల్‌పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని వెల్లడించింది. 
Vanitha Vijayakumar
 
కాగా, నటి వనిత విజయ్ కుమార్‌కు గతంలో ఆకాశ్, ఆనంద్ జే రాజన్‌లతో వివాహాలు జరిగాయి. కొంతకాలం రాబర్ట్ అనే వ్యక్తితోనూ డేటింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు, తన తండ్రి విజయ్ కుమార్‌తో ఆస్తి వివాదాల్లోనూ ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. ప్రస్తుతం ఈ వివాదాలను పక్కనబెట్టి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నా.. వనితకు పీటర్ మొదటి భార్యతో తలనొప్పి తప్పేలా లేదు. 

Vanitha Vijayakumar