సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 18 జూన్ 2020 (10:12 IST)

లాక్ డౌన్‌లో పెళ్లి చేసుకోబోతున్న వనితవిజయకుమార్ - పీటర్ పాల్

కరోనావైరస్ విజృంభణతో దేశంలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ సాగుతోంది. తమిళనాడులోని చెన్నైలో కూడా రేపటి నుంచి అంటే... జూన్ 19 నుంచి 30 వరకూ పూర్తి లాక్ డౌన్ విధించనున్నారు. ఐతే ఈ కాలంలో పెళ్లిళ్ల ముహూర్తాలున్నాయి. 
జూన్ 27న శుభముహూర్తాలు వుండటంతో తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె వనిత పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పీటర్ పాల్ ను వివాహం చేసుకుంటోంది. దీనికి సంబంధించిన వివాహ ఆహ్వానం ట్విట్టర్ వేదికగా షేర్ అయ్యింది.