సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (13:51 IST)

నిహారిక పెళ్లి నిరాడంబరంగా జరుగుతుంది.. అంతా కరోనా ఎఫెక్ట్

మెగా డాటర్ నిహారిక గురించి మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నిహారిక పెళ్లి గురించి ఆయన తండ్రి నాగబాబు మాట్లాడుతూ.. త్వరలోనే నిశ్చితార్థం వుంటుందని.. పెళ్లి మాత్రం పబ్లిక్ పండగలా కాకుండా పర్సనల్‌గా ట్రీట్ చేస్తున్నానని తెలిపారు. 
 
కరోనా కారణంగా అట్టహాసంగా పెళ్లి చేయడం కుదరకపోవచ్చునని.. ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి చేయాల్సి  వస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె పెళ్లి ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఓ ఎంఎన్సీ కంపెనీలో టాప్ పొజిషన్‌లో వున్న ఏపీ పోలీస్ అధికారి కొడుకుతో పెద్దలు మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఆగస్టులో ఎంగెజ్మెంట్, వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి అనుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో పెళ్లి సందడి కొనసాగుతోంది. 
 
నిఖిల్ ఇటీవలే పెళ్లి చేసుకోగా, త్వరలో నితిన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. కరోనా వైరస్ ముప్పు ఇప్పట్లో తీరేది లేదని ఫిక్స్ అయ్యాకే సింపుల్‌గా అయినా సరే పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే తరహాలో నిహారిక పెళ్లి నిడారంబరంగా జరుగనుంది.