1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Dulquer Convinced Me To Get Married: Nithya Menen

దుల్కర్ వల్ల నాలో మార్పు వచ్చింది.. నన్ను వివాహం చేసుకోమన్నాడు.. (Video)

Dulquer Salmaan
హీరోయిన్ నిత్యామీనన్, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌లు కలిసి మూడు సినిమాల్లో నటించారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. దుల్కర్‌తో ఆమెకున్న స్నేహం తెరపై మేజిక్ సృష్టించడానికి సహాయపడుతుందని నిత్యామీనన్ తరచుగా చెబుతుంటుంది. ఓకే కాదల్ కన్మణి చిత్రంలో దుల్కర్, నిత్య సన్నివేశాలను చూసి సినీ జనం ఆశ్చర్యపోయారు.
 
ఈ నేపథ్యంలో బ్రీత్ 2: ఇంటు ది షాడోస్ ప్రమోషన్ల సందర్భంగా, దుల్కర్ పూర్తి కుటుంబ వ్యక్తి అని, ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని ఒప్పించటానికి దుల్కర్ ప్రయత్నించాడని నిత్యామీనన్‌ తెలిపింది. అలాగే, వివాహం ఎంత గొప్పదో అతను ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ నిత్య మీనన్ వివాహంపై పెద్దగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. 
 
అయితే దుల్కర్ కారణంగా, వివాహం గురించి ఆమె ఆలోచనలు మారినట్లు కనిపిస్తోంది. కాగా నిత్య మీనన్ ప్రస్తుతం దర్శకత్వంపై దృష్టి పెట్టింది. ఇంకా వెబ్ సిరీస్‌లోనూ కనిపించనుంది. ఆమె రాబోయే సిరీస్, ఆమె డిజిటల్ అరంగేట్రం జూలై 10 నుండి ప్రైమ్ వీడియో నుండి ప్రసారం అవుతుంది.

 
About Writer
సెల్వి