జియో ఫైబర్ కస్టమర్లకు కాంప్లిమెంటరీ గిఫ్ట్.. గోల్డ్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు..

JioFi
JioFi
సెల్వి| Last Updated: బుధవారం, 8 జులై 2020 (20:58 IST)
జియో ఫైబర్ వినియోగదారులకు గుడ్ న్యూస్. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది. లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పిస్తోంది. స్టార్ట్ ఒరిజినల్, ఫాస్ట్ రన్‌తో పాటు ఇతర టీవీ, సినిమా కంటెంట్.. పాపులర్ ప్రోగ్రామ్‌లను జియో ఫైబర్ వినియోగదారులు వీక్షించే సదుపాయం వుంటుంది. బుధవారం నుంచి ఈ గిఫ్ట్ అమలులోకి వచ్చింది.

ఈ సదుపాయం హారర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ, సినిమాల కంటెంట్ చూసేందుకు ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, భోజ్ పురి భాషల్లో ఈ వీడియోలను వీక్షించవచ్చు. ఈ కాంప్లిమెంటరీని జియో ఫైబర్ సిల్వర్ యూజర్లు వీక్షించవచ్చు. అలాగే, కొత్త వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో టీవీ ప్లస్ యాప్ నుంచి జియోఫైబర్ యూజర్లు లయన్స్ గేట్ ప్లే కంటెంట్ చూడవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా లాగిన్ లేదా యాప్ డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

ఇకపోతే.. ఎక్కువ కంటెంట్‌ను వీక్షించాలనుకునే జియోఫైబర్ యూజర్లు గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లాన్‌లో హై స్పీడ్, ఎక్కువ బ్రాడ్ బ్యాండ్ డాటా లభిస్తుంది. గోల్డ్ ప్లాన్‌లో 250 ఎంబీపీఎస్ స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ (నెలకి 1750 జీబీ డేటా), భారత్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అంతర్జాతీయంగా తక్కువ ధరకే కాల్స్ అందిస్తుంది.దీనిపై మరింత చదవండి :