మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (13:01 IST)

దేశంలో బంగారం ఆల్‌టైమ్ రికార్డు

దేశంలో బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు ధర నమోదు చేసింది. బుధవారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,829కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ.67 అధికం. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలో కొత్త రికార్డు నమోదైనట్లయింది. 
 
ఇకపోతే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల గరిష్టానికి చేరిన నేపథ్యంలోనే ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ.49 వేలను దాటి ముందుకు సాగుతుందని వెల్లడించారు.
 
అలాగే, ఔన్సు బంగారం ధర బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లో 1,801 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా రెండో దశ కేసులు పలు దేశాల్లో విజృంభిస్తున్న వేళ, తమ పెట్టుబడులకు బులియన్ మార్కెట్ సేఫ్‌గా ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తూ ఉండటంతోనే బంగారం ధరలు పెరుగుతున్నాయి.