శాంసంగ్ ఫోన్ల బుకింగ్ ప్రారంభం.. జూలై 10 నుంచి విక్రయాలు

Galaxy A21s
Galaxy A21s
సెల్వి| Last Updated: మంగళవారం, 30 జూన్ 2020 (20:28 IST)
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ నుంచి కొత్త ఫోన్లు వినియోగదారుల అందుబాటులోకి రానున్నాయి. తాజాగా గెలాక్సీ ఎస్ 20 ప్లస్, గెలాక్సీ బడ్స్ ప్లస్ బీటీఎస్ ఎడిషన్ ధరలను శాంసంగ్ ప్రకటించింది. ఈ ఫోన్ల బుకింగ్ జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తేదీ నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఇకపోతే.. గెలాక్సీ ఎస్ 20 ప్లస్ బీటీఎస్ ఎడిషన్ ధర రూ. 87,999 కాగా, గెలాక్సీ బడ్స్ ప్లస్ బీటీఎస్ ఎడిషన్ ధర రూ. 14,990 మాత్రమే. గెలాక్సీ ఎస్20 అల్ట్రా వైట్ వేరియంట్ రూ. 97,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మూడు ఉత్పత్తులు జులై 10 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్ రెగ్యులర్ వెర్షన్ ధర రూ. 77,999. ఇది 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. గెలాక్సీ బడ్స్ ప్లస్ కూడా రూ.13,990కే అందుబాటులో ఉంది.దీనిపై మరింత చదవండి :