శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (15:31 IST)

ప్లాస్టిక్‌కు అమేజాన్ గుడ్ బై.. ఉద్యోగులకు బోనస్.. కరోనా వేళ ఎంత కష్టం..

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొన్నిరోజులు లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ సదుపాయాలన్నింటినీ రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆన్‌లైన్ సేవలందిస్తున్నారు. అయితే.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఇక వినియోగంచమని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ స్పష్టం చేసింది.

పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను తొలగిస్తూ బయోడీగ్రడబుల్ పేపర్‌టేప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఎటువంటి హాని కలగదని అమేజాన్ స్పష్టం చేసింది. ప్యాకింగ్‌కు వాడేది ఏదైనా వంద శాతం రీసైకిల్ చేయగలిగే మెటీరియల్‌నే వాడుతామని అమేజాన్ స్పష్టం చేసింది. 
 
మరోవైపు అమేజాన్ సంస్థ ఉద్యోగులకు ప్రోత్సాహాకాన్నిచ్చేలా బోనస్ ప్రకటించింది. కరోనా వేళ వినియోగదారులకు కావలసిన వస్తువులను చేరవేసిన ఉద్యోగుల కోసం 500 మిలియన్ల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు అమేజాన్ తెలిపింది. ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు, డెలివరీ పార్ట్‌నర్స్‌కు ఈ బోనస్ అందజేస్తున్నట్లు అమేజాన్ వెల్లడించింది.