శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (15:21 IST)

నాలుగంటే నాలుగే క్లిక్స్.. యోనో ద్వారా 24 గంటల్లోనే పర్సనల్ లోన్.. ఎస్‌బీఐ

ఎస్‌బీఐ నుంచి సులభంగా రుణం పొందవచ్చు. కరోనా వేళ ఇంటి నుండి ఆన్‌లైన్‌లో ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. ఇందుకోసం నాలుగు సులభమైన స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఈ రుణాన్ని పొందే అవకాశం వుంటుంది. వినియోగదారులు నాలుగు క్లిక్‌లలో YONO యాప్ ద్వారా లోన్ పొందవచ్చు. 
 
ఎస్ఎంఎస్ ద్వారా లోన్ పొందే అర్హతను మీరు తెలుసుకోవచ్చని ఎస్బీఐ ట్వీట్ చేసింది. దీని కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి PAPL<space><last 4 digits of Account No.>లను 567676 కు SMS చేయాలి. ప్రస్తుతం, ఇప్పటికే నిర్ణయించిన కొన్ని పరిమితుల ఆధారంగా వినియోగదారులకు బ్యాంక్ రుణాలు అందిస్తున్నారు. ఇందుకు ఫిజికల్ డ్యాక్యుమెంట్లు అవసరం లేదు.
 
ఎస్‌బీఐ యోనో లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
 
మొదట బ్యాంక్ YONO యాప్ లాగిన్ అవ్వండి. అప్పుడు Avail Now ఎంపికపై క్లిక్ చేయండి. అప్పుడు రుణ వ్యవధి మరియు మొత్తాన్ని ఎంచుకోవాలి. చివరగా, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTP‌ని ఎంటర్ చేసి, ఆ మొత్తం జోడించాల్సి ఉంటుంది.