శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:08 IST)

తన కంటే చిన్నవాడిని స్వీటీ అనుష్క పెళ్లి చేసుకోబోతుందా?

ప్రేమకు వయసు అడ్డంకి కాదన్నది తెలిసిందే. ఇప్పటికే చాలామంది విషయంలో ఇది నిరూపణ అయ్యింది. ఇప్పుడూ ఈ సంగతి ఎందుకయా అంటే... టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నటీమణిగా కొనసాగుతూ వచ్చిన అనుష్క శెట్టి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
తన వయసు కంటే తక్కువ వయసున్న వాడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దుబాయ్‌కి చెందిన అతడు బడా పారిశ్రామికవేత్త కుమారుడని చెపుతున్నారు. మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ఈ విషయాన్ని తెలియజేయలేదనీ, త్వరలో బయటకు వెళ్లడిస్తారని చెప్పుకుంటున్నారు.
 
కాగా గతంలో కూడా అనుష్క శెట్టి పెళ్లి గురించి అనేక రకాలుగా ఊహాగానాలు వచ్చాయి. బాహుబలి స్టార్ ప్రభాస్ ను పెళ్లాడుతుందని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. కానీ అవన్నీ గాలి కబుర్లని అటు ప్రభాస్ ఇటు అనుష్క కొట్టి పారేశారు. మరి తాజా ఊహాగానాలపై అనుష్క ఏం చెప్తుందో చూడాల్సిందే.