గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (14:01 IST)

జాతిరత్నాలు హీరోతో అనుష్క రొమాన్స్.. బరువు తగ్గే పనిలో బిజీ (Video)

జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టిన యువ హీరో నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇప్పుడో హాట్ కేక్‌గా మారాడు. జాతిరత్నాలు సినిమా తర్వాత ఇంకా ఏ సినిమాను ప్రకటించిన నవీన్.. యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు 'మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి' అనే టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
ఇక ఈ సినిమాను మహేష్ డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసమే ప్రస్తుతం అనుష్క బరువు తగ్గే పనిలో ఉందట. అనుష్క ఒక్కసారి స్లిమ్ లుక్ తెచ్చుకోగానే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 
 
ఈ సినిమాలో ఇద్దరూ మంచి యాక్టర్సే కాబట్టి సినిమా అదిరిపోద్దిని అంటున్నాయి ఇండస్ట్రీవర్గాలు. ఇక ఈ సినిమాతో పాటు నవీన్ స్టార్ ప్రోడ్యూసర్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాను చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడట. 
Naveen polisetty
 
ఈ రెండు సినిమాలతో పాటు నవీన్ మరో అవకాశం కూడా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నవీన్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.