1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Mamitha Baiju Creates Rare Record With 3 Rs. 200 Crore+ Films in 29 Day

Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు

Mamitha Baiju
Mamitha Baiju
హీరోయిన్ మమితా బైజు అరుదైన మైలురాయిని అందుకుంది. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న మమితా.. కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన మూడు విభిన్న చిత్రాలు ఒక్కొక్కటి రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించాయి. 
 
భారతీయ చలనచిత్ర రంగాన ఇంత తక్కువ సమయంలో ఒకే కథానాయిక నటించిన మూడు వరుస చిత్రాలు ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి భారతీయ నటిగా చరిత్రకెక్కిన మమితా, ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను విస్తరించుకుంటూ అగ్ర కథానాయికల సరసన నిలిచారు.
 
జులై 23న విడుదలై రూ.300 కోట్ల గ్రాస్ సాధించిన జననాయగన్ చిత్రంతో మొదలైన ఈ విజయ పరంపర, ఆగస్టు 14న వచ్చి రూ.240 కోట్లు రాబట్టిన విశ్వనాథ్ అండ్ సన్స్, అలాగే ఆగస్టు 21న వచ్చి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన బెత్లహోమ్ కుటుంబ యూనిట్ చిత్రాలతో సరికొత్త రికార్డుగా నమోదైంది. 
 
కేవలం 30 రోజుల వ్యవధిలో ఏకంగా రూ.740 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా మమితా బైజు తన మార్కెట్ స్టామినాను నిరూపించుకుంది. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల