సంబంధిత వార్తలు
- 'జై లవకుశ' కానీ 'స్పైడర్' రానీ 'మహానుభావుడు' తనదైన స్టయిల్లో...
- దేవసేనతో మహానుభావుడు చూశాను.. స్పైడర్, జై లవ కుశతో శర్వానంద్ పోటీ
- పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తి ప్రభాస్ : శర్వానంద్
- శర్వా మా ఇంటి హీరో.. రేపటి సూపర్‌స్టార్: ప్రభాస్ రాజు
- ముద్దెట్టపోతే బ్రష్ చేశావా అని అడిగిన ''మహానుభావుడు'': హగ్ చేసుకునేందుకు? (వీడియో)
నాకు ఆ హీరోతో చేయాలని ఉంది : మెహ్రీన్
'మహానుభావుడు' సినిమాలో క్యూట్ లుక్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచుకుంది హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. చేసిన సినిమాలు మూడే అయినా మెహ్రీన్ నటన అంటే యువ ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.
'మహానుభావుడు' సినిమాలో క్యూట్ లుక్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచుకుంది హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా. చేసిన సినిమాలు మూడే అయినా మెహ్రీన్ నటన అంటే యువ ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. మహానుభావుడు సినిమాతో తానేంటే నిరూపించుకున్న మెహ్రీన్ తెలుగు సినీపరిశ్రమలో ఒక హీరోతో నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని చెబుతోంది.
మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించిన హిందీ భామ మెహ్రీన్ కౌర్ పిర్ జాదా ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. హిందీ, తమిళ సినిమాలు మధ్యలో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో శర్వానంద్ సరసన మహానుభావుడు సినిమాలో నటించిన తర్వాత మెహ్రీన్ దశ తిరిగింది.
సినిమా మంచి విజయంతో ముందుకు దూసుకెళుతుండటంతో పాటు మెహ్రీన్ క్యారెక్టర్ కూడా హైలెట్‌గా నిలవడంతో మంచి అవకాశాలు వచ్చి పడుతున్నాయి. తనకు మహేష్ బాబుతో నటించాలన్న కోరిక ఎప్పటినుంచో ఉందని, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా? అని వేచి చూస్తున్నానని మెహ్రీన్ చెబుతోంది. మరి మెహ్రీన్ కోరిక ఇప్పట్లో నెరవేరుతుందో లేదో చూడాలి.
