సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (11:50 IST)

షేర్ చాట్‌లో న్యూడ్ ఫోటోను షేర్ చేసిన శ్రియా చరణ్

స్టార్ హీరోయిన్ శ్రియా చరణ్ న్యూడ్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. శ్రియా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో సంచలనంగా మారింది. ఆమె ఏకంగా ఓ న్యూడ్ ఫోటో షేర్ చేశారు. పెయింటింగ్ ఎగ్స్బిషన్ కి శ్రియా వెళ్లారు. 
 
అక్కడ అమ్మాయి న్యూడ్‌గా అటు వైపు తిరిగిన పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ వద్ద ఫోటో దిగారు శ్రియా. సదరు ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేశారు. పూర్తి నగ్నంగా ఉన్న ఫోటో షేర్ చేయడంతో నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రియా చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది.
 
2001లో విడుదలైన ఇష్టం మూవీతో వెండితెరకు పరిచయమైన శ్రియా పదేళ్లకు పైగా సౌత్ ఇండియాను ఊపేసింది. తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. 
 
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్ వంటి ఈ జనరేషన్ స్టార్స్ తో కూడా జతకట్టిన ఘనత ఆమె సొంతం. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రియా గొప్ప నటి కూడా.  
 
స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయిన శ్రియాకు ఇప్పటికీ అడపాదడపా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఆమె కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. శ్రియా ప్రధాన పాత్రలో గమనం పేరుతో ఓ చిత్రం తెరకెక్కింది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియా అజయ్ దేవ్ గణ్ భార్యగా చిన్న పాత్ర చేశారు.
 
ప్రస్తుతం శ్రియా హిందీ చిత్రం దృశ్యం-2లో నటిస్తున్నారు. మలయాళ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. అలాగే కన్నడలో మరో చిత్రం చేస్తున్నారు. కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరాక శ్రియ రష్యన్ ప్రియుడు ఆండ్రూని వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో చడీ చప్పుడు లేకుండా ఓ అబ్బాయికి శ్రియా జన్మనిచ్చారు.