1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Tamannaah Bhatia rejects Choli Ke Peeche remix

Tamannaah Bhatia: మాధురీ దీక్షిత్ చోలీ కే పీచే రీమిక్స్ వెర్షన్‌.. నో చెప్పిన తమన్నా భాటియా?

Tamannaah Bhatia
Tamannaah Bhatia
బాలీవుడ్, దక్షిణాది చిత్ర పరిశ్రమలలో ఐటమ్ సాంగ్స్ కోసం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా తమన్నా భాటియా నిలిచారు. జైలర్ చిత్రంలోని కావాలా, స్త్రీ 2లోని ఆజ్ కీ రాత్ నుండి, జై లవ కుశలోని స్వింగ్ జరా, సరిలేరు నీకెవ్వరులోని డాంగ్ డాంగ్ వంటి తెలుగు సూపర్ హిట్ పాటల వరకు... తమన్నా వరుసగా బ్లాక్‌బస్టర్ డ్యాన్స్ నంబర్లను అందించారు. 
 
ముఖ్యంగా ఆజ్ కీ రాత్ పాటలో ఆమె ప్రదర్శన భారీ సంచలనాన్ని సృష్టించింది. ఇది స్ట్రీమింగ్, సోషల్ మీడియాలో కొత్త రికార్డులను నెలకొల్పడమే కాకుండా, ప్రత్యేక గీతాల కోసం పరిశ్రమలో అత్యంత ప్రాధాన్యత కలిగిన తారగా ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. 
 
దీంతో తమన్నాకు ఇంతటి ప్రజాదరణ ఉన్నందున, చిత్రనిర్మాతలు ఆమెను ప్రతిష్టాత్మక డ్యాన్స్ నంబర్లలో నటింపజేయడానికి ఆసక్తి చూపించేందుకు ఆసక్తి చూపెట్టారు. తాజాగా పాపులర్ చోలీ కే పీచే పాట రీక్రియేటెడ్ వెర్షన్ కోసం తమన్నాను పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. 
 
ఇటీవల, సంజయ్ దత్ తన 1993 బ్లాక్‌బస్టర్ ఖల్నాయక్ చిత్రానికి సీక్వెల్‌గా ఖల్నాయక్ రిటర్న్స్‌ను ప్రకటించారు. అసలు చిత్రంలో మాధురీ దీక్షిత్ చోలీ కే పీచే పాట ఉంది. ఇది బాలీవుడ్‌లోని అత్యంత ప్రసిద్ధ డ్యాన్స్ నంబర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సీక్వెల్ కోసం ఒక రీమిక్స్ వెర్షన్‌ను రూపొందించాలని చిత్ర బృందం యోచిస్తోందని, అందులో నటించేందుకు తమన్నాను సంప్రదించిందని వార్తలు వచ్చాయి.
 
అయితే, తమన్నా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. దీనికి గల కచ్చితమైన కారణాన్ని ఆ నటి గానీ, చిత్ర నిర్మాతలు గానీ వెల్లడించనప్పటికీ, అంతటి ప్రతిష్టాత్మకమైన పాటలో మాధురీ దీక్షిత్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఆమె ఇష్టపడకపోయి ఉండవచ్చని టాక్ వస్తోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రియాంక చోప్రా ఎండార్స్‌మెంట్ల జాబితాలో రోలెక్స్