1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Tollywood hot news, Anu Emmanuel Interesting Comments on Pawan

పవన్ కళ్యాణ్‌ను చూడగానే నా ఫిలమెంట్ ఎగిరిపోద్ది... అను ఇమాన్యుయెల్...

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది అనూ ఇమ్యాయిల్. దీనికి కారణం లేకపోలేదు. ఆమె నటించింది రెండే సినిమాలయినప్పటికీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మార

Tollywood
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది అనూ ఇమ్యాయిల్. దీనికి కారణం లేకపోలేదు. ఆమె నటించింది రెండే సినిమాలయినప్పటికీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పీఎస్పీకె 25 చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అనూ ఇమ్యాయిల్ నటిస్తోంది. మరోవైపు ఆమె నటించిన ఆక్సిజన్ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఈ నేపధ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
 
పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అనుభవం గురించి చెపుతూ... పవన్ పక్కన నటించడం ఎంతో అదృష్టింగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు.... తొలిసారి ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్ తనపైనే చిత్రీకరించారనీ, ఆ సీన్లో పర్ఫెక్టుగా నటించాలన్న నిశ్చయంతో ఒకటికి పదిసార్లు డైలాగులను బట్టీకొట్టుకుని మరీ వెళ్లేదాన్నని గుర్తు చేసుకుంది. 
 
ఐతే పవన్ కళ్యాణ్ ముఖం చూడగానే డైలాగ్స్ మర్చిపోయి గాభరా పడిపోయేదాన్నని ఆమె వెల్లడించింది. కాగా పవన్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
లావణ్యా... అది చేస్తే పోయేది కదా... లేనిపోని తంటా....