శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2017 (15:37 IST)

యూత్ కోసం అందాలు ఆరబోయాల్సిందే : హీరోయిన్

సినీ యూత్ కోసం అందాలు ఆరబోయాల్సిందేనంటోంది ఓ హీరోయిన్, ఆ హీరోయిన్ ఎవరో కాదు డింపుల్ హయాతి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.

సినీ యూత్ కోసం అందాలు ఆరబోయాల్సిందేనంటోంది ఓ హీరోయిన్, ఆ హీరోయిన్ ఎవరో కాదు డింపుల్ హయాతి. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు.
 
చిన్నప్పటి నుంచి మంచి నటి అనిపించుకోవాలన్నదే తన కోరిక అని, అందుకే ఈ రంగంలోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది. అయితే, తొలుత సినిమా గ్లామర్‌ రోల్‌ చేయవచ్చు. అయితే ఆ ముద్ర నుంచి బయటపడడం కొద్దిగా కష్టమని తెలిపింది. 
 
అయితే, యూత్‌కి దగ్గర కావాలంటే గ్లామర్‌ రోల్స్‌ చేయడం తప్పనిసరని, అందువల్ల అవి కూడా చేస్తానని చెప్పారు. కానీ అన్నీ అలాంటి పాత్రలు చేయాలని లేదు. గ్లామర్‌ డాల్‌ అన్న ఇమేజ్‌ అక్కర్లేదు. టాలీవుడ్‌ అనే కాదు. అన్ని భాషల్లోనూ ఇమేజ్‌తో సంబంధం లేకుండా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారందరూ నాకు ఆదర్శమని చెప్పింది.