సంబంధిత వార్తలు
- ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...
- ప్రమోషన్స్ లు పెరుగుతున్నాయి కానీ ప్రేక్షకులే తక్కువయ్యారు !
- సినిమా నటులకు ఏం తెలుసని అంటున్నారు.. కిర్లంపూడిలో ఉండే పెద్దలంటే సంపూర్ణ గౌరవం : పవన్ కళ్యాణ్
- బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!
- నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ
మూడు నిమిషాల్లో అతడు కమిట్మెంట్ అడుగుతున్నాడని అర్థమైపోతుంది: యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ. ప్రతిభ గల యాంకర్ మాత్రమే కాదు నటి కూడా. జబర్దస్త్ షోతో ఆమె క్రేజీ యాంకర్ అని పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వరుస చిత్రాలతో బిజీ నటిగా మారారు. గ్లామర్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొన్నిసార్లు ఎదురవుతుందని, కానీ దాన్నుంచి సులభంగా తప్పించుకోవచ్చని కూడా చెపుతోంది ఈ బ్యూటీ.
ఒక చిత్రంలో నటించాలని ఒకరు మన వద్దకు వచ్చినప్పుడు అతడు మన పట్ల ఎలాంటి ఉద్దేశంతో వున్నాడో తొలి 3 నిమిషాల్లోనే అర్థమైపోతుందని చెప్పింది. ఇక వారి ఉద్దేశ్యం తెలిసాక మనం ఎలా మసలుకోవాలో కూడా తెలిపింది. తనవరకి తను... తన భర్త, పిల్లలు, సంసారం గురించి చెప్పేస్తుందట. దానితో అవతలి వ్యక్తి ఇక ఆ ప్రస్తావన తెచ్చే అవకాశం లేకుండా పోతుంది. కనుక కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అన్నట్లు వ్యవహరిస్తూ సినీ ఇండస్ట్రీలో నెగ్గుకుని రావాలని అంటోంది. అందుకే యాంకర్ అనసూయ ఎంతో తెలివైన నటి అని చెప్పేది.
