సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (14:21 IST)

ప్రమోషన్స్ లు పెరుగుతున్నాయి కానీ ప్రేక్షకులే తక్కువయ్యారు !

Tollywood logo
Tollywood logo
ఈ ఏడాది సమ్మర్ చాలా వేడిగా బయట ఎండలతో వాతావరణ వేడెక్కిపోతోంది.  ఒకపక్క క్రికెట్ సందడి, మరో వైపు ఎలక్షన్ల సందండి  అందుకే జనాలు రోడ్లమీద కూడా సరిగ్గా తిరగడంలేదు. ఇక సినిమా థియేటర్ కు ఎలా వస్తారంటూ.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే మనసు విప్పి మాట్లాడారు. తాను తీసిన ఫ్యామిలీ స్టార్ విడుదలకుముందే థియేటర్లకు జనాలురావడంలేదు. కానీ మా ప్రయత్నం చేయాలంటూ రకరకాలుగా ప్రమోషన్లు చేశారు. 
 
తాజాగా అన్ని సినిమాలు ఆ రూటులో వెళుతున్నాయి. ఇప్పుడు పబ్లిసిటీ అంతా సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్నారు నిర్మాతలు, హీరోలు. అలా కొత్తగా పుట్టుకువచ్చినవే ఎక్స్ (ట్విట్టర్), ఇన్ స్టాలు, యూట్యూబ్ లు,  మీమర్స్, ఇన్ ఫ్యూయన్సర్లు. వీరిని నమ్ముకుని సినిమా నిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. వారికోసం బడ్జెట్ లో కొంత ఎమౌంట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
 
ఇలా కొత్తగా వచ్చిన సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రయోజనాలు పొందుతున్నారు. ఒక సినిమా గురించి నెగెటివ్ గా రాయడం ,మాట్లాడడం, సినిమాకు సంబంధంలేని విషయాలు ఆసక్తిగా సెటరిక్ గా చూపించడం వీరి పని. మే మూడవ తేదీన దాదాపు పది సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో అల్లరి నరేశ్ నటించిన ఆ ఒక్కటి అడక్కు, వరలక్మి శరత్ కుమార్ నటించిన శబరి సినిమాలు కూడా వున్నాయి. మరికొన్ని చిన్న మధ్యతరహా సినిమాలు.
 
తాజాగా శబరి గురించి ఇన్ ప్లూ యన్సర్లతో చిత్ర యూనిట్ భేటీ వేసింది. వారికి తగిన విధంగా మంచి మర్యాలు చేసి భారీగా పబ్లిసీటీ ఏర్పాట్లు చేస్తోంది. బస్ స్టాండ్,రైల్వే స్టేషన్ నుంచి ఆఖరికి ఊరంతా ఎక్కడపబడితే బాగా చేరువయ్యేలా యూట్యూబర్లను ఉపయోగించుకుంటుంది. అందులో సినిమాలో లేనివి వున్నట్లు భ్రమించేలా వారి మాటలుంటాయి. ఏదో విధంగా ప్రేక్షకుడిని టెంప్ట్ చేసి థియేటర్ కు రాబట్టేలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎన్ని చేసినా థియేటర్ కు ప్రేక్షకుడు వస్తాడో రాడో తెలీదుకానీ సినిమాకు పబ్లిసిటీ పెరిగి కనీసం ఓటీటీ మార్కెట్ వస్తుందనే ఆశ వుందని ప్రముఖ నిర్మాత తెలియజేయడం విశేషం.