1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (11:37 IST)

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

Kona Venkat
Kona Venkat
కోన వెంకట్ తన సొంతూరు బాపట్లలోని గవర్నమెంట్ హాస్పిటల్‌ను చూసి షాక్ అయ్యాడట. ఇందుకు కారణం.. ఆ ఆస్పత్రి ఇదేదో కార్పోరేట్ హాస్పిటిల్‌లా వుండడమేనట. బాపట్లలోని ప్రభుత్వ ఆస్పత్రి.. అందులోనూ నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన వార్డ్‌ను చూసి.. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రిలా వుందని షాక్ అయ్యాడట. 
 
ఇదే నిజమైన అభివృద్ది అని వైఎస్ జగన్ మీద ప్రశంసలు కురిపించాడు. దీంతో ఈ ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలేమో కోన వెంకట్ ట్వీట్ మీద పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. 
 
జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం కోన వెంకట్‌ను ఏకిపారేస్తున్నారు. ఇది అభివృద్ధా  కామెడీ చేయకండి.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు.