గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (19:07 IST)

తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు!!

telangana assembly
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు 547 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు వుంది. తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, 25వ తేదీతో ముగిసింది. ఇందులో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతో పాటు డమ్మీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లతో కలుపుకుంటే 547కు చేరింది. 
 
ఒక్క ఖమ్మం లోక్‌సభ స్థానానికి ఏకంగా 29 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌‍సభ స్థానాలకు 120కి పైగా నామినేషన్లు వచ్చాయి. అయితే, నామినేషన్లు దాఖలు చేసేందుకు గురువారం చివరి రోజు కావడంతో దీనికితోడు మంచి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. కొందరు అభ్యర్థులు రెండు లోదా మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.