1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (10:03 IST)

ఎమ్మెల్సీ ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

teenmaar mallanna
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు  జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధిష్టానం సీటును కేటాయించింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. ఈ క్రమలో పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఆయన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా కూడా వెలువరించారు. ఈ ఎన్నికలకు మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకున్నారు.