సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (10:10 IST)

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధమవుతున్న 'తమన్నా'!!

tamanna - pawan
ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన - టీడీపీ - బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు. అధికార వైకాపా తరపున వంగా గీతను బరిలోకి దిగారు. అయితే, పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి ప్రటించారు. గతంలో తాను జనసేన పార్టీలో పని చేశానని చెప్పారు. అయితే, పవన్ కళ్యాణ్‌ కలిసి జనసేన పార్టీలో పని చేసినట్టు చెప్పారు. పవన్‌పై పోటీ చేస్తానని తమన్నా ప్రకటించడం ఇపుడు సంచలన వార్తగా మారింది. 
 
కాగా, వైకాపా తరపున వంగా గీత పోటీ చేస్తుండగా, రామచంద్రయ్య యాదవ్ స్థాపించిన భారత చైతన్య. యువజన పార్టీ తరపున ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన 38 మంది అభ్యర్థుల జాబితాలో తమన్నా పేరు ఉండటం ఇపుడు ఆసక్తికరంగా మారింది. 
 
అయితే, ప్రముఖులపై పోటీకి దిగడం సింహాద్రికి కొత్తేమీకాదు. గతంలో ఆమె మంగళగిరిలో కూడా నారా లోకేశ్‌పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఒకపుడు జనసేన పార్టీలో ఉన్న తమన్నా అపుడు మంగళగిరి టిక్కెట్ ఆశించారు. అయితే, ఆమెకు మంగళగిరి టిక్కెట్ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. అయితే, ఇపుడు టీడీపీ - జనసేన - బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటంతో పవన్‌పై తమన్నా విమర్శలు గుప్పించడమే కాకుండా, ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.