ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (14:17 IST)

ఉగాది నాడు పిఠాపురం చేబ్రోలులో నూతన గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్- video

pawan kalyan gruha pravesam
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో తన నూతన గృహప్రవేశం చేసారు. ఉగాది సందర్భంగా పూజాది కార్యక్రమం నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉగాది తెలుగు ప్రజలందరికీ సుఖసంతోషాలను శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంఛార్జి శ్రీ కృష్ణంరాజు గారు పాల్గొన్నారు.