1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 ఏప్రియల్ 2024 (20:17 IST)

అసోచామ్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్

image
సైబర్ సెక్యూరిటీ ఆందోళనలకు ప్రతిస్పందనగా, సైబర్ సెక్యూరిటీ- సవాళ్లు మరియు అవకాశాలపై ఒక సదస్సును అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ నిర్వహించింది. నోవాటెల్ హైదరాబాద్‌లో జరిగిన ఈ సదస్సు సైబర్ పరిశ్రమలో పెరుగుతున్న ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. అసోచామ్ తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లోని ఐటి ప్యానెల్ కన్వీనర్, ప్రణవ గ్రూప్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- సిటిఓ, శ్రీ రాంబాబు బూరుగు సాదర స్వాగతంతో సమావేశం ప్రారంభమైంది.
 
శ్రీమతి శిఖా గోయెల్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిఐడి, తెలంగాణ మాట్లాడుతూ... ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.  పెరుగుతున్న సైబర్ నేరాలపై గణాంకాలను పంచుకున్న ఆమె సైబర్ డొమైన్‌లో ప్రజలకు అవగాహన, నివారణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు. "సైబర్ క్రైమ్ కారణంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా $10.50 ట్రిలియన్ల నష్టం జరుగుతుందని అంచనా వేయబడింది. ఒక దేశంగా కొలిస్తే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దీనిని చెప్పాల్సి ఉంటుందన్నారు. 
 
తెలంగాణ ప్రభుత్వంలోని ITE &C డిపార్ట్‌మెంట్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్, ఓఎస్డి శ్రీమతి రమా దేవి లంక మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, సైబర్‌ సెక్యూరిటీ ప్రమాణాలుగా అమలు చేయడానికి వాటి సాధ్యాసాధ్యాలను గురించి వెల్లడించారు. "సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ముందుకు సాగడానికి మనం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించాలి" అని ఆమె తెలిపారు. ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఎం.వి. పాండురంగారావు సైబర్‌ సెక్యూరిటీ ముప్పు తగ్గించడానికి ఇన్‌స్టిట్యూట్ చేపడుతున్న చర్యలను వివరించారు.
 
63 SATS యొక్క టెక్ సీఈఓ శ్రీ నీహర్ పఠారే మాట్లాడుతూ సైబర్ దాడులు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న వినూత్న సాంకేతికతలను గురించి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (టెక్), ఈస్టర్న్ సీబోర్డ్, హెడ్‌క్వార్టర్స్, కోస్ట్ గార్డ్ కమాండర్ (ఈస్ట్రన్ సీబోర్డ్) శ్రీ మనోజ్ కుమార్ పాధి; అసోచామ్  తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లోని ఐటి ప్యానెల్ కో-కన్వీనర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ & సైబర్ డిఫెన్స్ సెంటర్ హెడ్, Cloud4C శ్రీ దీపక్ మిశ్రా; అసోచామ్ అదనపు డైరెక్టర్, శ్రీ మచ్చా దినేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.