1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (09:17 IST)

దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదు : ఏపీ డీజీపీని మార్చండి ... ఈసీకి బీజేపీ ఫిర్యాదు

rajendranath reddy
అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌‍సభ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రత వైఫల్యం ఉందని, రాజకీయ నేతలతో దాడులు జరుగుతున్నా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. తక్షణం ఏపీ డీజీపీని బదిలీ చేయాలని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించాలని ఇప్పటికే బీజేపీ నేతలు రెండు సార్లు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. 
 
ఏపీలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు రాజకీయ సేవా అధికారులుగా మారిపోయారని బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్‌ల జారీలో ఎన్నికల అధికారుల నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల్లో విధుల్లో ఉన్న ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్న 10 లక్షల మందికి పోస్టల్ ఓట్లు ఉన్నాయని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి పోస్టల్ బ్యాలెట్ల గడవు సమయాన్ని మరింత పొడగించాలని భానుప్రకాశ్ రెడ్డి కోరారు.