సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 ఏప్రియల్ 2024 (17:21 IST)

2 రోజుల్లో రూ. 2 కోట్లు, ఆ హీరోయిన్‌ను మర్చిపోలేక గెడ్డం పెంచుకుని తిరుగుతున్న హీరో

mental
సినీ ఇండస్ట్రీలో గాలివార్తలు మామూలే. బాలీవుడ్ ఇండస్ట్రీలో రోజుకో గాలి కబురు హల్చల్ చేస్తుంటుంది. ఐతే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వారానికో నెలకో ఓ గాలి వార్త మాత్రం పుట్టకుండా వుండదు. ఇపుడు ఇలాంటి వార్తే టాలీవుడ్ ఫిలిమ్ సర్కిళ్లలో తిరుగుతోంది.
 
ఓ స్టార్ యంగ్ హీరో అందమైన బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రేమలో పడ్డాడట. ఆమె కోసం చొంగ కార్చుకుంటూ ఆమె వెనకాలే తిరిగాడంట. దాంతో ఆమె అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆమె సై అనేసరికి ఆమెకోసం ఏకంగా 2 రోజుల్లో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసాడట. తీరా మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగితే... ఏదో ఫీలవుతున్నావని ఈ 2 రోజులు నీతో ఎంజాయ్ చేసా. 
 
నీ వెల్త్ స్టామినా నాకు చాలదు అని చెప్పి ఎలాంటి మొహమాటం లేకుండా ముంబైకి చెందిన కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నదట. దానితో ఇప్పుడు ఈ యంగ్ హీరో ఆమెను మర్చిపోలేక గెడ్డం పెంచుకుని తిరుగుతున్నాడట. కాల్షీట్లు అడిగితే కాస్త రిలాక్స్ కావాలని మేనేజర్‌తో చెప్పి పంపించేస్తున్నాడట. అసలు విషయం ఏంటా అని ఆరాదీస్తే ఇది బయటపడిందట. ఇంతకీ ఆ హీరోహీరోయిన్లు ఎవరని అడిగితే మాత్రం మీకు తెలుసు కదా అంటున్నారు ఫిలిమ్ జనం. ఇలా అంటే మనం ఏం చేస్తాం.