గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 మే 2024 (11:54 IST)

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

Ram Charan  hyderabad air port
Ram Charan hyderabad air port
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. లైట్ కలర్ వైట్ డ్రెస్ తో ఆయన కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకుని నాచురల్ గా నడుచుకుంటూ లోపలికి వెళుతుండగా ఫొటోలు క్లిక్ మన్నాయి. తాజా సమాచారం మేరకు ఈరోజు చెన్నైలో గేమ్ ఛేంజర్ షూటింగ్ జరగనుంది.
 
చెన్నై గోల్డెన్ బీచ్ దగ్గరలో ఓ మాల్ లో ఫంక్షన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. సాయంత్రం షూట్ జరగనుంది. అక్కడ ఓ పార్టీకి సంబంధించిన వేడుక జరగనుంది. ఇప్పటికే దానికి ముందు సీన్లు హైదరాబాద్ లో చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గేమ్ చేంజర్ అనేది రాజకీయ క్రీడలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే దిశగా శంకర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తను ఏ సినిమాలు చేసినా ముందు తరాలు కూడా ఆలోచించేలా వుంటాయి. త్వరలో ఈ సినిమా గురించి మరింత సమాచారం తెలియనుంది.