బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (19:55 IST)

పిఠాపురంలో మెగా ఫ్యామిలీ.. పవన్ కోసం చిరంజీవి, బన్నీ, చెర్రీ?

chiru-ramcharan
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వంటి వారు ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గమైన పిఠాపురంలో పవర్‌స్టార్ కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు.
 
2019 ఎన్నికల్లో పవన్ ఓడిపోయినందున, ఈసారి, నటుడు-రాజకీయనాయకుడి మద్దతుదారులు ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. శనివారం మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ తన ‘బాబాయ్’ నియోజక వర్గంలో ప్రచారం చేసేందుకు పిఠాపురం వరకు వెళ్లారు.
 
అయితే పవన్ కోసం మెగా ఫ్యామిలీ ప్రచార బరిలోకి దిగనుందని టాక్ వస్తోంది. పవన్ ప్రచారానికి మెగాస్టార్ చిరు రావడం ఖాయం అయితే, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు కూడా రావచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనాని కోసం చెర్రీ, బన్నీ ప్రచారం చేసేందుకు సిద్ధంగా వున్నారని టాక్ వస్తోంది. 
 
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని, దానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందని, రామ్ చరణ్ నియోజకవర్గంలో ఒకట్రెండు రోజుల పాటు ఇంటింటికీ ప్రచారానికి వెళ్లవచ్చని కొందరు అంటున్నారు. 
Allu arjun-berlin
Allu arjun-berlin
 
ఇంతకుముందు అల్లు అర్జున్ పవన్ మీటింగ్‌కి వెళ్లడం చూశాం. అయితే చరణ్ తన బాబాయ్ కోసం ఎన్నికలలో వెళ్ళలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.