సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2024 (14:09 IST)

పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ఎందుకయ్యాడు? హైపర్‌ ఆది వివరణ

Pawan Kalyan
Pawan Kalyan
నాగబాబు ద్వారా మేం జబర్ దస్త్ లో కలిసినప్పుడు పవన్, చిరంజీవి గురించి చర్చించుకునేవాల్ళం. అలా మొదటిసారి పవన్ గారిని కలిశాను. ఆ కలవడం జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి నేను ప్రచారంలో పాల్గొనేవాడిని. ఈసారి కూడా ఎన్నికలలో ప్రచారంలో పాల్గొంటున్నాను అని హైపర్ ఆది అన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
 
పవన్ కళ్యాన్ అనగానే ఎందుకంత మీరు రియాక్ట్ అవుతారు అన్న ప్రశ్నకు హైపర్ ఆది తెలుపుతూ.. ఎంత పెద్ద హీరో అయినా ఒకరోజు, రెండు రోజులు మూడు రోజులు ఇలా కొద్దిరోజులు ఎగ్సైట్ మెంట్ వుంటుంది. కానీ  పవన్ కళ్యాణ్ చూడాలంటే ప్రతిరోజు ఎక్సైట్ మెంట్..  అలా ఎందుకు అనేది చెప్పలేను. నేను చుట్టుపక్కల వారిని కూడా గమనించాను.  వారికి కూడా అదే ఫీలింగ్.. ఈరోజుల్లో డబ్బు చుట్టూ ప్రపంచం నడుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో డబ్బు గురించి పట్టించుకోడు. ఆయనకు గతంలో ప్యాకేజ్ స్టార్ అనే పేరు వచ్చింది. అప్పట్లో జనసేన పెట్టి ప్రచారం చేశారు. కానీ అప్పుడు పవన్ గారి గురించి పెద్దగా ప్రజలకు తెలీయకపోవడమే ప్రధాన లోపం. దాంతో ఆపేరు వచ్చింది.
 
నిజంగా ప్యాకేజ్ స్టార్ అయితే,  కౌలు రైతులకు, ఇతర సేవా కార్యక్రమాలకు, పేద కళాకారులకు ఎందుకు చేయూత ఇస్తారు.  ఆయన గురించి తెలియపోవడం వల్లే ఇంతకుముందు ఎలక్షన్ లలో రెండు చోట్ల ఓడిపోయారు. అప్పట్లో డబ్బులు అపోజిట్ వారు పంచడం, బ్యాడ్ ప్రచారం చేయడం వల్లే జరిగింది  ఈసారి అంతా మారిపోయింది. పవన్ ఖచ్చితంగా గెలుస్తాడు. గతంలో జనసేన పార్టీ కొద్ది తేడాలో ఓడిపోయింది. ఇప్పుడు మూడు పార్టీలు కలిసాయి కాబట్టి మరింత సక్సెస్ అవుతుంది.. అని హైపదర్ ఆది తెలిపారు.