శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (18:08 IST)

వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని అందుకున్న రామ్ చరణ్

Ramchan at vels
Ramchan at vels
ఆర్.ఆర్.ఆర్. సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన రామ్ చరణ్ కు చెన్నై వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. నటనతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు, ముఖ్యంగా యూత్ లో ఫాలోయింగ్ ను బట్టి ఆయన ఈ అవార్డు ఇచ్చినట్లు తెలుస్తోంది. చరణ్ నటుడేకాదు నిర్మాత కూడా. కొద్ది సేపటి క్రితం చెన్నైలో 14వ వార్షిక కాన్వొకేషన్‌లో వేల్స్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని అందుకున్నారు.
 
Ramchan at vels
Ramchan at vels
గ్రాడ్యుయేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అధికారికంగా ఈ గౌరవప్రదమైన గుర్తింపును అందుకున్నారు. ఆయను సంప్రదాయం ప్రకారం మేళతాళాలతో వేదికకు ఆహ్వానం పలికారు.  ఏప్రిల్ 13న జరిగిన యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేడుకకు కూడా నటుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
Ramchan at vels
Ramchan at vels
రామ్ చరణ్‌కు చెన్నై విశ్వవిద్యాలయం అధికారికంగా గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. "తిరు. రామ్ చరణ్, భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత మరియు వ్యవస్థాపకుడు, వేల్స్ విశ్వవిద్యాలయం నుండి వారి 14వ వార్షిక కాన్వకేషన్ (sic)లో గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీని అందుకున్నారు." అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
 
ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ దర్శకుడు శంకర్ వంటి వ్యక్తుల యొక్క గౌరవనీయమైన సంస్థలో ఉంచుతుంది. చరణ్‌తో పాటు, ఈ సంవత్సరం గ్రహీతలలో చంద్రయాన్, ఇస్రోలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ పి వీరముత్తువేల్ మరియు అనేక ఇతర గౌరవనీయ వ్యక్తులు ఉన్నారు.
 
ఇక, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. సమకాలీన రాజకీయ రంగం, విద్యారంగంపై ఎక్కుపెట్టి అస్త్రంగా ఈ కథ వుంటుందని తెలుస్తోంది. శంకర్ దర్శకుడు.