ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:12 IST)

పారిస్ ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చిన రామ్ చ‌ర‌ణ్

Charan-upsana airport
Charan-upsana airport
గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవలే పారిస్ ట్రిప్ తన భార్య ఉపాసన తో వెళ్లారు.  అక్కడ చరణ్ కు ఓ సొంత హౌస్ కూడా ఉందని తెలుస్తోంది. బిజినెస్ టూర్ గా వెళ్లి అక్కడ ఓ యాడ్ చేసాడని అంటున్నారు. కానీ ఇంకా అది బయటకు రాలేదు. తాజాగా హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల్లో `గేమ్ చేంజ‌ర్‌` షూటింగ్లో పాల్గొననున్నారు. రామ్ చ‌ర‌ణ్ కు ఇది 15వ సినిమా. 
 
తమిళ  డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రంఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు అంటిస్తున్నారు.