గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి

deadbody
హైదరాబాద్ నగరంలో శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోంగార్డు రవీందర్ మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. 
 
సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని రవీందర్‌ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన షాయినాయత్‌గంజ్‌ ఠాణా పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 
 
వ్యభిచార మహిళలను ఇంటికి పిలిపించుకుని చంపేశాడు.. ఎక్కడ? 
 
రువాండా దేశంలో దారుణం జరిగింది. ఈ దేశ రాజధాని కిగాలీలో ఓ వ్యక్తి అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు. వేశ్యలను ఇంటికి పిలిపించుకుని వారిని చంపేసి, ఫోన్లు, ఇతర వస్తువులను దోచుకునే కిరాతకుడుని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ సీరియల్ కిల్లర్ వేశ్యలను చంపేసిన తర్వాత ఆ మతదేహాలను కిచెన్‌లో గొయ్యి తీసి పాతిపెట్టేవాడు. 
 
ఇలా వరుసగా నేరాలకు పాల్పడుతున్న ఓ సీరియల్‌ కిల్లర్‌ను రువాండా రాజధాని కిగాలీ పోలీసులు అరెస్టు చేశారు. 34 ఏళ్ల నిందితుడి ఇంట్లో జరిపిన తవ్వకాల్లో 10 మృతదేహాల అవశేషాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిందితుడు కొన్ని మృతదేహాలను యాసిడ్‌ వేసి కరిగించినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడగింపు  
 
ఆధార్ కార్డు ఉచిత అప్‌డేట్ గడువును మరోమారు పొడగించారు. ఈ నెల 14వ తేదీతో ఈ ఉచిత అప్‌డేట్ గడువు ముగియనుంది. దీంతో ఈ గడువును మరో మూడు నెలలు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తాజాగా పొడగింపుతో కలుపుకుంటే ఈ ఉచిత అప్‌డేట్ గడువు డిసెంబరు 14వ తేదీ వరకు ఉంది. 
 
అప్పటిలోపు ఆధార్ కార్డులో ఉన్న తప్పొప్పులతో పాటు.. ఫోటో, చిరునామా, చేతి వేలిముద్రలు తదితర వివరాలను మార్చుకునే వెసులుబాటు ఉంది. సాధ్యమైనంత ఎక్కువ మంది ఆధార్ కార్డులో తమ డాక్యుమెంట్స్‌ అప్ డేట్ చేసుకునేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, ఈ గడువును ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.