శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దాయాది దేశం పాకిస్థాన్‌లో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్ ధరలు

petrol
దాయాది దేశం పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పటికే భారీగా పెరిగిపోయిన విద్యుత్ చార్జీలతో ఆ దేశ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇపుడు ఇంధన ధరల భారం కూడా మరింతగా పెరిగనుంది. పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి. ప్రధాని అన్వరుల్ హక్ కకర్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం గురువారం పెట్రోల్ ధర లీటరుకు రూ.14.91, డీజిల్ ధర రూ.18.44 మేర పెంచింది. దీంతో, లీటరు పెట్రోల్ ధర రూ.305.36కు చేరుకోగా, డీజిల్ ధర రూ.311.84ను తాకింది.
 
విద్యుత్ చార్జీల భారంతో ఇప్పటికే అల్లాడుతున్న పాక్ ప్రజలను ఇంధన ధరలు కూడా పట్టి పీడిస్తున్నాయి. పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి. ప్రధాని అన్వరుల్ హక్ కకర్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం గురువారం పెట్రోల్ ధర లీటరుకు రూ.14.91, డీజిల్ ధర రూ.18.44 మేర పెంచింది. దీంతో, లీటరు పెట్రోల్ ధర రూ.305.36కు చేరుకోగా, డీజిల్ ధర రూ.311.84ను తాకింది.
 
ఇటీవల కాలంలో పాక్ ప్రజలు విద్యుత్ చార్జీలు భరించలేక నిరసనల బాట పట్టారు. పలు ప్రాంతాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, విద్యుత్ బిల్లుల దహనాలను చేపట్టారు. డిస్కమ్ సంస్థల అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ఇక ప్రజలపై ధారాభారాన్ని తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఊరట కల్పించట్లేదు.