గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (23:22 IST)

సీజనల్ వ్యాధుల నివారణకు, చిన్నచిన్న అనారోగ్యాల అడ్డుకట్టకు ఈ చిట్కాలతో మేలు

ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు వైద్యాలయాలకు వెళ్లనవసరంలేదు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం సొంతమవుతుంది. కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాము. రోగనిరోధక శక్తి ఒనగూరాలంటే పసుపును వాడుతుండాలి. పంటినొప్పితో బాధపడేవారు లవంగంను బుగ్గన పెట్టుకుంటే పోతుంది.
 
గొంతునొప్పి సమస్యతో ఇబ్బందిపడేవారు అల్లం టీని తాగుతుంటే తగ్గుతుంది. కడుపు నొప్పితో బాధపడుతుంటే వాము నీళ్లు తాగితే ఉపశమనం కలుగుతుంది. రక్తహీనత సమస్యతో వున్నవారు దానిమ్మ రసం తాగుతుంటే మేలు జరుగుతుంది.
 
గ్యాస్ట్రిక్ సమస్య ఇబ్బంది పెడుతుంటే మెంతులు తీసుకుంటే సరిపోతుంది. జలుబుకి బాగా కాచిన నీళ్లలో కాస్తంత విక్స్ వేసి ఆవిరి పడితే ఉపశమనం కలుగుతుంది.