ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 30 ఆగస్టు 2023 (17:02 IST)

కరివేపాకు టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

curry leaves
కరివేపాకు టీ తాగడం వల్ల వాంతులు, వికారం, మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ టీ చుండ్రు, జుట్టు పల్చబడటం, కరుకుదనం వంటి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా ఈ కరివేపాకు టీతో కలిగే ప్రయోజనాలు చూద్దాం. కరివేపాకు టీ తాగితే అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. ఈ టీ తాగడం వల్ల అందులో వుండే యాంటిఆక్సిడెంట్స్ చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
 
కరివేపాకు టీ తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రయాణాల్లో వాంతులయ్యేవారు కరివేపాకు టీ తాగితే మేలు కలుగుతుందంటున్నారు. మధుమేహం సమస్య వున్నవారికి కరివేపాకు టీ మంచి ఛాయిస్ అని చెపుతున్నారు. గర్భిణీ స్త్రీలు వికారంగా వున్నప్పుడు కరివేపాకు టీ తాగడం వల్ల ఫలితం వుంటుంది.
 
కరివేపాకు టీని తయారు చేయడానికి మంచినీటిని బాగా మరగకాచి అందులో కరివేపాకు ఆకులు వేసి రంగు మారాక వడపోత పోస్తే టీ రెడీ.