సంబంధిత వార్తలు
- వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారా? మహిళలూ ఈ స్కీమ్ గురించి తెలుసా?
- సౌర కుటుంబం అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో మార్కెట్లోకి Vivo V29e:ఫీచర్స్ లీక్..
- ఈ స్ఫూర్తితో గగన్‌యాన్‌కు సిద్ధమవుదాం.. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ పిలుపు
- ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైకాపా ఔట్... ఇండియా టు డే - సీ ఓటర్ సర్వే
అవిశ గింజలతో చక్కెర వ్యాధికి చెక్
నేటి సమాజంలో మధుమేహం బారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. చక్కెర వ్యాధి బారిన పడకుండా, ఒక వేళ ఇప్పటికే వచ్చినా సురక్షిత స్థాయుల్లో దాన్ని కట్టడి చేయాలంటే అనుసరించాల్సిన జీవనశైలిపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ గృహ విజ్ఞానశాస్త్ర విభాగం ఆచార్యులు, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.శిరీష అధ్యయనం చేశారు. అవిశ గింజలు, పెరుగుతో మధుమేహాన్ని నియంత్రిస్తాయా అనే కోణంలో తమ పరిశోధన సాగించారు.
మహిళా, ఎస్వీ యూనివర్సిటీలలో ఉన్న 100 మంది టైప్2 డయాబెటిక్ పేషెంట్లను 25 మంది చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి, మొదటి గ్రూపులో ఉన్నవారికి మూడు నెలలపాటు వంద మిల్లీగ్రాముల పెరుగునే ఇచ్చారు. రెండో గ్రూపునకు 25 గ్రాముల అవిశగింజలను అందించారు. మూడో గ్రూపునకు 100 మిల్లీ గ్రాముల చొప్పున పెరుగు, 25 గ్రాముల అవిశగింజలను ఇచ్చారు. నాలుగో గ్రూపునకు 100 మి.గ్రా. పెరుగు, అవిశగింజలు, ఒక గ్రాము స్పొరొలాక్ అందించారు.
ఇలా మూడు నెలల పాటు ఈ ఆహారాన్ని ఇచ్చి తర్వాత అందరికీ షుగరు పరీక్ష చేశాం. కేవలం పెరుగు తీసుకున్న మొదటి 25 మందిలో మధుమేహ స్థాయి తగ్గలేదు. 25 గ్రాముల అవిశగింజలు తీసుకున్న రెండో గ్రూపు సభ్యుల్లో షుగర్ లెవెల్స్ తగ్గాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌తోపాటు బరువు కూడా తగ్గారు. పెరుగు, అవిశగింజలు, స్పొరొలాక్ తీసుకున్నవారిలో కూడా ఇదే ఫలితం వచ్చింది.
"అవిశ గింజలను నేరుగా కాకుండా వేయించి ఉప్పునీళ్లు చల్లుకుని తింటే రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. నేరుగా తినలేనివారు పొడిలా చేసుకుని అన్నంలో కలుపుకొని తినొచ్చు. వీటిని ప్రతిరోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది'' అని శిరీష వివరించారు.
