పెళ్లి పేరుతో నటి సోదరిపై అత్యాచారం.. ఆపై ఫోటోలు, వీడియోలతో బెదిరింపులు
బెంగళూరు నగరంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. పెళ్లి పేరుతో ఓ నటి సోదరిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగుళూరు నగర చంద్రాలే అవుట్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి రాఘవేంద్ర (28) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నట సోదరి, రాఘవేంద్ర ఇద్దరూ ఒకే చోట పనిచేస్తుండటం గమనార్హం.
దీంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మంచి, ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. పైగా, నిందితుడు రాఘవేంద్రకు అప్పటికే వివాహమైన విషయాన్ని దాచిపెట్టి నటి సోదరితో ప్రేమాయణం కొనసాగించాడు.
ఈ క్రమంలో ఆమెను బలవంతం చేసి శారీరక సంబంధాన్ని కొనసాగించడమే కాకుండా, సన్నిహితంగా ఉన్నపుడు ఫోటోలు, వీడియోలు తీశాడు. ఇపుడు వీటిని అడ్డుపెట్టుకుని బాధితురాలిని బెదిరించి, డబ్బు వసూలు చేయసాగాడు. అతని వేధింపులను భరించలేని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.
