ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (15:01 IST)

భారత్‌లో మార్కెట్లోకి Vivo V29e:ఫీచర్స్ లీక్..

Vivo v29e
Vivo v29e
Vivo V29e మరికొద్ది రోజుల్లో భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీని ఫీచర్లు, ధర లీక్ అయ్యాయి. భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను శాసించేందుకు Vivo మరో కొత్త మోడల్‌ను సిద్ధం చేసింది. Vivo V29E స్మార్ట్‌ఫోన్ ఈ నెల 28న భారతదేశంలో లాంచ్ కానుంది. 
 
అయితే, ఆన్‌లైన్‌లో ఇప్పటికే అనేక లీక్‌లు కనిపించాయి. లీక్‌ల ద్వారా ఈ గాడ్జెట్‌లోని కొన్ని కీలక ఫీచర్లు బయటకు వచ్చాయి. Vivo VE29E రెండు స్టోరేజ్, రెండు కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 8GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 26,999. 8GB RAM-256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా తెలుస్తోంది. ఇవి ఆర్కిటిక్ రెడ్, ఆర్కిటిక్ బ్లూ షేడ్స్‌లో అందుబాటులో ఉంటాయి.
 
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌ని కలిగి ఉంది. అలాగే 5000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది.
 
ఇది సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. RARE 64MP ప్రైమరీ, 8MP అల్ట్రా వైడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. క్లారిటీతో ఫోటోలు తీయాలనుకునే వారికి ఈ మొబైల్ చాలా ఉపయోగపడుతుంది.
 
ఈ Vivo V29E ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో i-autofocus సామర్ధ్యం, వెనుక కెమెరా కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.