1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana : husband negative commnets on Mutton Curry, Wif attack with fire in warangal

మటన్ కూర బాగోలేదన్న భర్త... కొరివితో మూతి కాల్చిన భార్య...

wife attack on husband
మటన్ కూర బాలేదన్నందుకు ఓ భార్య కొరివితో కట్టుకున్న భర్త మూతిని కాల్చింది. దీంతో తీవ్ర గాయాలతో భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వరంగల్ నగరంలోని ఒక కాలనీలో నివాసం ఉండే దంపతులు మధ్య మంగళవారం రాత్రి భోజన సమయంలో ఈ ఘోరం జరిగింది. మటన్ కూర వండిన భార్య.. భర్తకు వడ్డించగా, అది బాలేదని భర్త అన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య సమీపంలోని నిప్పుల కొరివితో భర్త ముఖంపై కాల్చింది. 
 
ఈ దాడిలో భర్త ముఖం, మెడ, చేతులు, తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మా సార్ మాకే కావాలి.. హెడ్మాస్టర్ బదిలీపై రోడ్డెక్కిన విద్యార్థులు... దిగొచ్చిన జార్ఖండ్ సర్కారు