పవన్ కొత్త రికార్డ్.. రష్యన్ అమ్మాయిని పవర్ స్టార్ అందుకే పెళ్లి చేసుకున్నారా?

pawan kalyan - lezinova
pawan kalyan - lezinova
సెల్వి| Last Updated: గురువారం, 13 ఆగస్టు 2020 (16:20 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, దానికి సమయం పట్టేటట్లు ఉండడంతో వాళ్లంతా నిరాశకు లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు. దీనికోసం నెల రోజుల ముందుగానే ఆయన అభిమానులు హడావిడి మొదలెట్టారు. AdvanceHappyBirthdayPawanKalyan అనే క్యాంపైన్‌ కూడా స్టార్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ వీరాభిమానిగా.. జనసైనికుడుగా తన వాదనను బలంగా వినిపించిన కళ్యాణ్ దిలీప్ సుంకర పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాలతో పార్టీకి దూరమయ్యారు. అయితే ఇప్పుడు న్యాయవాదిగా టీవీ చర్చల్లో తన వాదనలు వినిపిస్తూ పవన్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు దిలీప్ సుంకర.

అయితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై వస్తున్న విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టిన దిలీప్ సుంకర.. పవన్ కళ్యాణ్ రష్యన్ యువతిని చేసుకోవడంపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ''విమర్శలు వినడానికి బాగానే ఉంటాయి.. బేస్ లెస్ విమర్శలు వినడానికి ఇంకా బాగుంటాయి తప్పితే వాటిలో అర్థం ఉండదు.

పవన్ కళ్యాణ్ గారు రష్యన్ అమ్మాయిని ఎందుకు చేసుకున్నారు అంటే.. రేపటి రోజున డబ్బులు లేకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ సాయం చేస్తారు కాబట్టి.. పుతిన్ గారు డబ్బులు ఇస్తారంట అంటే.. కథ కూడా బాగుంటుంది.

అరవింద సమేతలో ఎన్టీఆర్ ఓ డైలాగ్ చెప్తాడు.. చెప్పేవాడు సరిగా చెప్పాలి కాని.. ఒక్కో సందర్భంలో చెప్పేదాన్ని బట్టి దాని విలువే మారిపోద్ది అని. పవన్ రష్యా వెళ్లాడు.. పుతిన్ సాయం కోసమేనా అంటే వాళ్లకి ఏం చెప్తాం.. కొన్ని ఆరోపణలకు బేస్ ఉండదు.. అవి వినడానికి బావుంటాయి అంతే’ అంటూ ఆసక్తికరకామెంట్స్ చేశారు దిలీప్ సుంకర.

అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.దీనిపై మరింత చదవండి :