శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (23:08 IST)

ఆ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాహల్ సిప్లిగంజ్ ప్రేయసి..?

పునర్నవి అని చెప్పడం కన్నా రాహుల్ సిప్లిగంజ్ ప్రియురాలు అంటేనే అందరికీ బాగా తెలుస్తుంది. పిట్టగోడ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఉయ్యాల జంపాల లాంటి సినిమాలో నటించింది పునర్నవి. సినిమాల్లో కన్నా ఆమెకు బిగ్ బాస్ తోనే మంచి పేరు వచ్చింది.
 
అందులోను బిగ్ బాస్‌లో రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె నడిపిన ప్రేమాయణంపై పెద్ద చర్చే జరిగింది. దీంతో రాహుల్ లవర్‌గా పునర్నవి యువకులకు బాగా దగ్గరైంది. బిగ్ బాస్ తరువాత పునర్నవికి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అందులోను పవర్ స్టార్ సినిమాలో ఆమెకు అవకాశం లభించింది.
 
వకీల్ సాబ్ సినిమాను ప్రస్తుతం క్రిష్ దర్సకత్వంలో తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ హీరో. లాక్‌డౌన్ ముందే ఈ సినిమా కూడా ఘూటింగ్ స్టార్ట్ చేశారు. 1870సంవత్సరం నాటి పరిస్థితుల నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా క్రిష్ అద్భుత కథను రెడీ చేశారు. 
 
పవన్ కళ్యాణ్ జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుంది. ఈ సినిమాలో పునర్నవి కీ రోల్ పోషిస్తోంది. అయితే ఆమెకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తున్నారో ఆ విషయం చెప్పలేదు. కానీ పునర్నవికి అవకాశం రావడంతో ఆమె మాత్రం ఎంతో సంతోషంగా ఉందట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమే పోస్ట్ చేసిందట.