సంబంధిత వార్తలు
- జనగణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్... పాన్ ఇండియా మూవీగా తీస్తా: పూరి జగన్నాథ్
- తెలుగు సీరియల్ నటుడికి కరోనా ... యూనిట్ సభ్యులంతా క్వారంటైన్
- మమ్మల్ని విడిచి వెళ్లిపోయి వారం దాటింది .. సుశాంత్ మరణంపై భూమిక ట్వీట్
- 'రెడ్‌ట్రీ' బ్రాండ్ పేరుతో మాస్క్‌లు తయారు చేయిస్తున్న లావణ్యా త్రిపాఠీ
- కుటుంబాన్ని నమ్ముకుని సినిమాల్లోకి రావొద్దు.. దమ్ము వుండాలి: రేణు దేశాయ్
గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అప్‌డేట్ వచ్చేసింది..!
గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తెరకెక్కించడం.. ఆ సినిమా విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గుణశేఖర్... హిరణ్యకశ్యప అనే సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్టు చెప్పారు. ఇది చెప్పి చాలా రోజులు కాదు కాదు సంవత్సరాలు అయ్యింది కానీ.. దీనికి సంబంధించి అప్‌డేట్ రాలేదు.
అయితే, గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే... హిరణ్యకశ్యప ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందని గుణశేఖర్ ట్వీట్ చేసారు.
ఈ ప్రాజెక్ట్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సాధారణ పరిస్థితుల కోసం వేచిచూస్తున్నాం.. ఓం నమో నారాయణాయ’’ అని గుణశేఖర్ తన ట్వీట్ చేయడంతో ఈ సినిమా గురించి మరింత ఆసక్తి ఏర్పడింది.
ఈ మూవీని దగ్గుబాటి రానాతో గుణశేఖర్ తెరకెక్కించనున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, హాలీవుడ్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రానాతో పాటు నటించే మిగిలిన నటీనటులు ఎవరు..? సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు కలిసి నిర్మించే హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏది..? అనేది త్వరలోనే తెలియనుంది.
