శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (09:46 IST)

తెలుగు సీరియల్ నటుడికి కరోనా ... యూనిట్ సభ్యులంతా క్వారంటైన్

ఓ తెలుగు సీరియల్ నటుడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్న యూనిట్ సభ్యులందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ సడలింపులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ, టీవీ షూటింగులు ప్రారంభమైన విషయం తెల్సిందే. భౌతికదూరం పాటించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలు సినీ, టీవీ పరిశ్రమలకు స్పష్టం చేశాయి. 
 
కానీ, ఓ తెలుగు టీవీ సీరియల్ యూనిట్లో కరోనా కలకలం రేగింది. సీరియల్లో నటిస్తున్న ఓ నటుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ ధారావాహిక షూటింగ్ నిలిపివేశారు. యూనిట్ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. కాగా, ఈ తెలుగు టీవీ సీరియల్ ప్రముఖ చానల్లో ప్రసారమవుతోంది.
 
కరోనా సోకిన నటుడు తిరుపతి నుంచి నేరుగా షూటింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ నటుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత షూటింగులు ప్రారంభమయ్యాయన్న ఆనందంలో ఉన్న బుల్లితెర నటీనటులు ఈ పరిణామంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఘటన మిగతా టీవీ సీరియళ్లపైనా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.