బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 17 జూన్ 2020 (22:41 IST)

అంతపెద్ద రైలులో అంతమందేనా? ఎందుకలా..?

తిరుపతి వెళ్లే ఏ రైలేనా గతంలో నిత్యం రద్దీగా ఉండేది. ఒకటి, రెండు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూన్ 1 నుంచి ప్రారంభించిన తిరుపతి-నిజామాబాద్ (రాయలసీమ) ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలులో సగం బెర్తులు కూడా నిండటంలేదట.
 
తిరుపతి నుంచి నిజామాబాద్ బయలుదేరిన ఈ రైలులో 8ఎసి బోగీలు ఉండగా 40 మంది ప్రయాణీకులు మాత్రమే ఉన్నారట. సికింద్రాబాద్ వచ్చేసరికి ఏడుగురు మాత్రమే మిగిలారట. నిజామాబాద్ వరకు వారు మాత్రమే ప్రయాణించారట. ప్రయాణీకులు ఇంతేనా అంటూ ఆశ్చర్యపోయారట రైల్వేశాఖ అధికారులు.
 
ఇదంతా కరోనా పుణ్యమే అని రైల్వేశాఖాధికారులు భావిస్తున్నారట. అయితే రానురాను కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారట. ఇదే జరిగితే భారతీయ రైల్వే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు ఆ శాఖ ఉద్యోగులు.