బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (15:14 IST)

గోవింద రాజ స్వామి ఆలయంలో కరోనా కలకలం.. ఉద్యోగికి కరోనా

తిరుమలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలిందని టీటీడీ ఈవో వెల్లడించారు. దీంతో శుక్ర, శనివారాల్లో ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని చెప్పారు.
 
అలాగే శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసిన తరువాత ఆదివారం నుండి యధావిధిగా ఆలయాన్ని తెరుస్తామన్నారు. ఆలయంలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగికి వేరువేరు ఆరోగ్య సమస్యలు ఉండడంతో రెగ్యులర్ చెకప్‌కు వెళ్లారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
ఈ ఉద్యోగి సంచరించిన పాత హుజుర్ ఆఫీస్‌, పిహెచ్ స్టోర్‌ను కూడా రెండు రోజులు మూసివేసి శానిటైజ్ చేసిన తర్వాతే తెరుస్తారు. అదేవిధంగా, ఉద్యోగికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరినీ గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.