సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (12:21 IST)

ఆ ఏడు రాష్ట్రాలపై పగబట్టిన కరోనా వైరస్

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 
 
అయితే, దేశంలో కరోనా కేసులు నమోదవతున్న రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటిలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజుకు సగటున పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,535కి చేరగా ఒక్క మహారాష్ట్రలోనే 97,648 వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చైనాను దాటేసిన మహారాష్ట్ర తాజాగా కెనడాను అధికమించింది.
 
ఆ రాష్ట్రంలో కరోనా వల్ల 3,590 మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 38,716కు చేరగా 349 మంది చనిపోయారు. మూడోస్థానంలో ఉన్న ఢిల్లీలో కేసుల సంఖ్య 34,687, మరణాల సంఖ్య 1,085గా ఉన్నది. 
 
కాగా, కరోనా వైరస్ పురుడు పోసుకున్న చైనాలో 84652 కేసులు నమోదు కాగా, 4645 మంది చనిపోయారు. అలాగే పొరుగుదేశమై పాకిస్థాన్‌లో 119536 కేసులు నమోదు కాగా, 2356 మంది చనిపోయారు.