శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (22:08 IST)

హైదరాబాద్ మేయర్ కారు డ్రైవర్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బుసలు కొడుతోంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవరుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మేయర్ కార్యాలయంలో నమోదైన రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు ఇది. 
 
మేయర్ కార్యాలయ వర్గాల సమాచారం మేరకు... కరోనా వైరస్ సోకిన డ్రైవర్ ఉదయం నుంచి ఆఫీసు విధులకు హాజరయ్యాడు. దీంతో మేయర్ బొంతు రామ్మోహన్‍కు కూడా శుక్రవారం కరోనా వైద్య పరీక్షలు చేయనున్నారు. 
 
అలాగే, కరోనా వైరస్ సోకడంతో మేయర్ కార్యాలయాన్ని కూడా మూసివేసి, శానిటైజేషన్ చేస్తున్నారు. ఈ వార్త స్థానికుల్లో ఆందోళనకు గురిచేసింది. అలాగే, మేయర్ కుటుంబ సభ్యులు కూడా హోం క్వారంటైన్‌కు తరలించారు.