గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (13:07 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లెక్కేంటి? కొత్తగా 127 కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. తెలంగాణలో గురువారం కొత్తగా మరో 127 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనే నమోదయ్యాయి. ఏకంగా 110 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
 
ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తవాటితో కలిపి ఇప్పటివరకు కరోనా కేసులు 3,377కి చేరాయి. కరోనాతో నిన్న ముగ్గురు మరణించగా.. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకూ కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 71కి చేరింది. 
 
అలాగే గురువారం 24 గంటల వ్యవధిలో 9,986 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటివరకూ కరోనా నుంచి 2,273 మంది డిశ్చార్జి కాగా.. 1033 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.