శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (11:45 IST)

రైళ్లలో ప్రయాణాలా వద్దే వద్దు.. కరోనా సోకిందంటే..?

కరోనా ప్రభావంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటుండగా, ఇదివరకే రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రైళ్లల్లో ప్రయాణం వద్దే వద్దు అంటున్నారు.. జనం. ఎందుకంటే.. కరోనా వ్యాధిగ్రస్థులు చాలామంది ఇప్పటికే రైళ్లలో ప్రయాణించి వుంటారు. 
 
అలాగే వలస కార్మికులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి సొంతూర్లకు చేరుకుని వుంటారు. ఫలితంగా రైళ్లలో ప్రయాణం అంటేనే జనాలు ఆసక్తి చూపట్లేదు. ఇంకా రైళ్ల ప్రయాణం ఆరోగ్యానికి అంత మంచిది కాదని జనాలు భావిస్తున్నారు. గతంలో ఢిల్లీ నిజాముద్దీన్ వ్యవహారం యావత్ దేశాన్ని వణికించింది. ఢిల్లీలో ప్రార్థనలు ముగిసిన అనంతరం .. వారంతా ఐదు రైళ్లలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణించినట్లు గుర్తించారు. 
 
అలాగే వలస కార్మికుల్లో చాలామందికి కరోనా సోకినట్లు తేలడంతో ఇప్పటికిప్పుడు రైళ్లలో ప్రయాణం అవసరమా అంటూ జనం అనుకుంటున్నారు. ఇంకా కరోనా సోకకుండా వుండాలంటే.. రైళ్లల్లో, బస్సుల్లో ప్రయాణాలు అనవసరమని ప్రజలు జాగ్రత్తపడుతున్నారు. కరోనా సోకి చికిత్స పొందడం కంటే.. రాకుండా జాగ్రత్త పడటం చాలా మేలని ప్రజలు అనుకుంటున్నారు.. అందుకే రైళ్లలో ప్రయాణించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.